బాంబులు విసిరిన కోతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

- July 21, 2018 , by Maagulf
బాంబులు విసిరిన కోతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

అసలే కోతి.. ఆపై అన్నంతపని చేసింది. కోతి బాంబులను విసరడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో బాంబులున్న సంచిని ఓ కోతి ఎత్తుకెళ్తుండగా దాన్ని వెంబడించారు ముగ్గురు స్థానికులు. వారు వెంబడించడంతో  దానికి చిర్రెత్తుకొచ్చి ఆ సంచిని విసిరింది. ఇక అందులో ఉన్న బాంబులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో గులాబ్ గుప్తా (60) అతని మనవడు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు. కోతులు డంపింగ్ యార్డ్ నుంచి ఆ సంచిని తీసుకొచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. సంచితో ఇంటిపైన ఆడుకుంటుండగా వాటిని తరిమే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com