రష్యా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 21 మంది మృతి, 20 మంది కి గాయాలు

- December 13, 2015 , by Maagulf
రష్యా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 21 మంది మృతి, 20 మంది కి గాయాలు

 రష్యా వోరోనిజ్ ప్రాంతంలోని మానసిక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 74 మంది ఉన్నారన్నారని.... వారిలో నలుగురు ఆసుపత్రి సిబ్బంది అని పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలు అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. అగ్నిప్రమాదంలో ఆసుపత్రి దాదాపుగా కాలిపోయిందని ఉన్నతాధికారి తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com