నాకేం క్యాన్సర్ లేదు.. నేను బాగానే ఉన్నాను.. - లకీ అలీ
- July 21, 2018
‘సై’ సినిమాలో ‘అప్పుడప్పుడు’.. గోదావరి చిత్రంలో ‘చారుమతి ఐ లవ్యూ’.. ‘బాయిస్’ మూవీలో ‘సారేగమే పదనిసె’ లాంటి తదితర పాటలు పాడిన బాలీవుడ్ సింగర్ లకీ అలీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ అతనిపై పలు అనుమానాలకు తావిచ్చింది.
‘ప్రియమైన కీమోథెరపీ నువ్వు ఎప్పటికీ ప్రత్యామ్నాయంగా మారకు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అలీ. దీంతో లకీ అలీకీ క్యాన్సర్ సోకిందోమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లకీ అలీ మీడియా ముందుకొచ్చి ‘నేను బాగానే ఉన్నాను. నేను క్యాన్సర్ బాధితుడను కాను' అంటూ వివరణ ఇచ్చారు.
ఇటీవల తన స్నేహితుడు క్యాన్సర్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. కీమెథెరపీ చేయించుకున్నప్పటికీ అతను మృతి చెందాడట. ఈ సందర్భంగానే అలీ ఇటువంటి కామెంట్ చేశాడని తెలిపాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







