అండర్ గ్రౌండ్‌లో హనీమూన్.. ఏ జంటకైనా మధురానుభూతే!
- July 22, 2018
తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో.. హానీమూన్ అంతే మధురంగా ఉండాలని నూతన వధూవరులు భావిస్తుంటారు. దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు హనీమూన్ మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఈ మధురమైన క్షణాలను అనుభవించడానికి, కొన్ని రోజులపాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి ఉల్లాసంగా గడపడాలనుకుంటారు.
శారీరకంగా మరియు మానసికంగా ఒకటయ్యేందుకు నేల లోపల, 500 అడుగుల లోతులో, విశాలంగా తవ్విన సొరంగాల మధ్య, రెండు అంటే రెండే డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉండే చోట మొదటి ఉల్లాస యాత్రని సెలబ్రెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఊహించటానికే చాలా థ్రిలింగ్ అనిపిస్తుంది కదూ! మరి ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా.. ఇలాంటి చోటు స్వీడిష్ నగరంలో ఉంది.
ప్రపంచంలో భూగర్భంలో లోతైన హోటల్‌ని స్వీడిష్ నగరం సాలాలో నిర్మించారు. ఈ హోటల్ నిర్మాణం 1908లో పూర్తయింది. ఇది భూమికి 155 మీటర్ల పొడవు, 508 అడుగుల లోతులో ఉంటుంది. ఇది దేశంలో అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన వెండి గని. దాన్ని హోటల్‌గా మార్చేశారు. దీంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒకరోజు విడిది చేయడానికి వీలుగా సౌకర్యాలన్నీ ఉన్నాయి.
నూతన వధూవరులు ఒకరు మీద ఒకరు ప్రేమ చూపించుకోవడానికి.. భూగర్భంలో ఉన్న అనుభూతిని పూర్తిగా పొందాలనుకునేవాళ్లు అక్కడున్న ఏకాంత మందిరాన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్‌కామ్ తప్ప బయటి ప్రపంచంతో మరే సంబంధమూ లేని ఈ చోట విడిది చేయడం ఏ జంటకైనా మధురానుభూతే!
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







