నితిన్ కళ్యాణానికి ముహూర్తం పెట్టిన సిద్ధార్థ్
- July 22, 2018
దిల్ రాజు సంస్థ నుంచి వచ్చిన 'లవర్' ఘోర పరాజయం చెందినా ఆ పరాజయానికి ఏమాత్రం షాక్ అవ్వకుండా దిల్ రాజ్ తన సంస్థ నుంచి రాబోతున్న మరో మూవీ 'శ్రీనివాసకల్యాణం' ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా చేస్తున్నాడు. నితిన్ రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సిద్దార్థ్ హీరోగా నటించి దిల్ రాజ్ కు కోట్లు కురిపించిన 'బొమ్మరిల్లు' విడుదలైన ఆగస్టు 9న విడుదల చేస్తున్న నేపధ్యంలో నితిన్ కళ్యాణానికి సిద్ధార్థ్ ముహూర్తం పెట్టాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పటికే అంచనాలు పెంచుకుంటున్న ఈమూవీకి సంబంధించిన ఒక పోస్టర్ ఇప్పుడు చాలందిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ లో నితిన్ రాశి ఖన్నా కాలును తనపై పెట్టుకుని ఆభరణం తోడుగుతున్న సీన్ కు సంబంధించిన పోస్టర్ అందరికీ బాగా నచ్చింది.
ఈమూవీ ఆడియోకు కూడ మంచి స్పందన రావడంతో పాటు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన ట్యూన్స్ విపరీతంగా యూత్ కు కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ ఆడియోకు బాలసుబ్రమణ్యం మధురమైన గాత్రంతో కూడిన పాట ఈమూవీ ఆడియో స్థాయిని ఎన్నో రేట్లు పైకి తీసుకెళ్లింది. అదేవిధంగా దీనికితోడు ఈమూవీలోని అన్ని పాటలు మెలోడీ ట్యూన్ తో ఉండటంతో ఈమూవీ స్థాయి ఎక్కడికో వెళుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఇక ఐదవ పాట 'సం థింగ్ సం థింగ్' అంటూ అనురాగ్ శ్రావణి గాత్రాలతో పాటు రాశి ఖన్నా గొంతు కూడా ఈపాటలో వినిపించడం అందరికీ బాగా కనెక్ట్ అవుతోంది. తెలుగు సాంప్రదాయాలకు చిరునామాగా ఉండే పెళ్లి సరదాలను ఒక మంచి కథతో కూర్చి చేస్తున్న దిల్ రాజ్ 'శ్రీనివాసకళ్యాణం' ప్రయత్నం రాజ్ తరుణ్ 'లవర్' సినిమా ద్వారా వచ్చిన భారీ నష్టాలను పూడ్చే విధంగా ఉంది అని అంటున్నారు..
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







