ముంబయి అంతటా రాహుల్ గాంధీ,మోడీ హగ్‌ పోస్టర్లు

- July 22, 2018 , by Maagulf
ముంబయి అంతటా రాహుల్ గాంధీ,మోడీ హగ్‌ పోస్టర్లు

అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ అనూహ్యంగా మోడీని ఆలింగనం చేసుకున్న సంఘటనను ఆ పార్టీ ఇప్పుడు ప్రచారాంశంగా మలచుకుంది.  రాహుల్ మోడీ హగ్‌ పోస్టర్లు ముంబయి అంతటా వెలిశాయి, మేము గెలుస్తాం. విద్వేషంతో కాదు...ప్రేమతో... అనే సందేశం కూడా ఈ పోస్టర్లలో చేర్చారు. అంధేరీలోని పార్టీ కార్యాలయం ముందైతే ఏకంగా సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ పేరిటే ఈ పోస్టర్లు ఉండడం విశేషం. బీజేపీ ఎంతగా విద్వేష రాజకీయాలు చేసినా తాము మాత్రం ప్రేమతోనే వారిపై విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. 

మరోవైపు బీజేపీ మాత్రం ఈ పోస్టర్ల స్టంట్‌ను విమర్శిస్తోంది. వారిలో నిజమైన ప్రేమ భావన లేదు అనడానికి ఈ పోస్టర్లే నిదర్శనమని అంటున్నారు. ప్రచారం కోసమే రాహుల్‌ మోడీని ఆలింగనం చేసుకున్నారని.. ఈ పోస్టర్లతో రాహుల్‌ ఉద్దేశం దేశవ్యాప్తంగా తెలిసిపోయిందని.. బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com