సాంకేతిక సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథం

- July 23, 2018 , by Maagulf
సాంకేతిక సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథం

అబుదాబీ కమర్షియల్‌ బ్యాంక్‌ స్టేషన్‌ (కరామా) మరియు బుర్జ్‌ ఖలీఫా / దుబాయ్‌ మాల్‌ స్టేషన్‌ మధ్య రెడ్‌ లైన్‌ మెట్రో సర్వీసులకు కలిగిన సాంకేతిక అంతరాయం తొలగిపోయిందని ఆర్‌టిఎ వెల్లడించింది. దుబాయ్‌ మెట్రో సకాలంలో సమస్యను గుర్తించి, పరిష్కరించినందుకుగాను ఆర్‌టిఎ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో ప్రయాణీకుల సహకారం మరువలేనిదని ఆర్‌టిఎ ట్విట్టర్‌లో వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యతో దుబాయ్‌లో మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం తలెత్తింది. సాంకేతిక కారణాలతో అబుదాబీ కమర్షియల్‌ బ్యాంక్‌ స్టేషన్‌ - బుర్జ్‌ ఖలీఫా / దుబాయ్‌ మాల్‌ స్టేషన్‌ మార్గంలో ఎండు వైపులా మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి. మెట్రో సేవల అంతరాయం పట్ల చింతిస్తున్నట్లు ఆర్‌టిఎ పేర్కొంది. సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథంగా నడిచాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com