తెలుగు ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్
- July 25, 2018
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనలో అందర్ని ఆక్టుకుంది. దీంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఐతే, టాలీవుడ్ లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని జాన్వీని కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచిస్తున్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల నిర్మాత దిల్ రాజు తో చర్చలు కూడా జరిపారని చెప్పుకొంటున్నారు.
మరోవైపు, రాజమౌళి మల్టీస్టారర్ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుందని ప్రచారం జరుగుతోంది. తారక్, చరణ్ లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా జాన్వీని తీసుకొన్నారంట జక్కన్న. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లోనూ రిలీజ్ కాబోతుండటంతో.. ఇందులో నటించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







