ఉగాండాకు భారీ సాయం ప్రకటించిన మోదీ

- July 25, 2018 , by Maagulf
ఉగాండాకు భారీ సాయం ప్రకటించిన మోదీ

కంపాలా: ఉగండా పార్లమెంట్‌లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆఫ్రికా ముత్యం ఉగండా అని ఆయన అన్నారు. దేశంలో సుసంపన్న వారతస్వం, సహజ సంపదలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య అనేక సంబంధాలు ఉన్నట్లు మోదీ తెలిపారు. జింజాలో గాంధీ విగ్రహం వద్ద గాంధీ స్మారక కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. మానవులకు విముక్తి, గౌరవం, సమానత్వం ఇవ్వడమే స్వాతంత్ర ఉద్యమ ఉద్దేశమని, ఆఫ్రికాలో ఇది అవసరరం అన్నారు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న స్థానిక తెగలకు తాము అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు. ఆఫ్రికాతో భాగస్వామ్యం నెలకొల్పడం గర్వంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆఫ్రికా ఖండంలో ఉగండా కీలక దేశమని, ఈ దేశానికి అనేక ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మోదీ చెప్పారు. విద్యుత్తు లైన్ల కోసం 141 మిలియన్ల డాలర్లు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. వ్యవసాయ కోసం మరో 64 మిలియన్ల డాలరలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పది సూత్రాల ఆధారంగా ఆఫ్రికా దేశాలతో సంబంధాలు నెలకొల్పుతామని మోదీ అన్నారు. ఆఫ్రికాకు తమ ఎజెండాలో అగ్ర స్థానాన్ని కల్పిస్తామన్నారు.

స్థానికంగా అవకాశాలు క్రియేట్ చేసేందుకు సహకరిస్తామన్నారు.ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టే విధంగా తమ వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. ఆఫ్రికాలో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉందని, కానీ ఆ ఖండం నుంచి కేవలం 10 శాతం మాత్రమే ఔట్‌పుట్ వస్తుందని మోదీ అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం నిరోధంలోనూ కలిసి పనిచేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com