విద్యా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
- July 26, 2018
ఎన్టీఆర్ బయోపిక్ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో గ్యాప్ లేకుండా సాగుతోంది. మంగళవారంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ క్రిష్ స్వయంగా తెలిపాడు. బాలకృష్ణ-విద్యాబాలన్‌లకు సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించినట్టు సమాచారం. అనుకున్న దానికంటే రష్ బాగా రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ!
అందులోనూ విద్యాబాలన్ రోల్ చిన్నదే కావడంతో వేగంగా పూర్తి చేశారని చెబుతున్నారు. ఇంతవరకు ఓకే.. మరి, తన రోల్ కోసం విద్యాబాలన్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటోంది? అనేది ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తొలుత రోల్ గురించి చెప్పగానే ఓకే చేసిందని, రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా మాట్లాడలేదని అంటున్నారు. పాత్ర చిన్నదైనా దాదాపు రెండుకోట్ల వరకు విద్యా డిమాండ్ చేసినట్టు ఓ వార్త హంగామా చేస్తోంది. అందులోనూ బయోపిక్, తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ వుండడంతోనే ఈ స్థాయిలో తీసుకుంటోందని అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!