సాక్ష్యం షోస్ మొదలయ్యాయి..
- July 26, 2018
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ - పూజా హగ్దే జంటగా శ్రీవాస్ డైరెక్షన్లో అభిషేక్ నామా నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. ఖర్మ సిద్ధాంతం నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగట్టే ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అభిషేక్ , ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఉదయం 8:45 పడాల్సిన షోలు ఆగిపోయాయి. మిగతా షోలు కూడా రద్దైయే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ , ప్రస్తుతం అభిషేక్ , ఫైనాన్షియర్ల మధ్య బేరసారాలు జరిగాయని , దీంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోలు మొదలు అయ్యినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ తో పాటు అన్ని నగరాల్లో 11 గంటల షోస్ మొదలు అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ అంత ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రూ. 40 కోట్ల భారీ ఖర్చు తో ఈ మూవీ ని అభిషేక్ నిర్మించగా , ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ "ఎరోస్" సొంతం చేసుకొంది. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని , వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని , బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్తంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్స్ లలో చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!