తెలుగు ప్రజలకు వాట్సాప్‌ తాజా హెచ్చరిక

- July 26, 2018 , by Maagulf
తెలుగు ప్రజలకు వాట్సాప్‌ తాజా హెచ్చరిక

హైదరాబాద్‌:ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌  తెలుగు ప్రజలకు  తాజా హెచ్చరికలను జారీ చేసింది. ఇటీవలి కాలంలో తప్పుడు సందేశాలు, పుకార్లు వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా షేర్‌ కావడం,  అనంతరం జరుగుతున్న  అమానుష దాడుల ఈ నేపథ్యంలో  వాట్సాప్‌  ఈ ప్రకటనను విడుదల చేసింది. యూజర్లు అందుకున్న సమాచారం నిజమైనదా, నకిలీదా  నిర్ధారించుకోవడానికి సంబంధించి 10 చిట్కాలను  ఈ ప్రకటనలో సూచించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకుచెందిన వార్తాపత్రికల్లో ప్రత్యేకంగా తెలుగులో ఫుల్‌ పేజీ ప్రకటన జారీ చేసింది. తప్పుడు సమాచారం, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు  కొన్ని సూచనలు చేసింది.   పుకార్ల వ్యాప్తిని నిరోధించడంలో తమతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.  ఉభయ  తెలుగు రాష్టా‍ల్లో ప్రజలపై దాడులు, మరణాలు  చోటు చేసుకోవడంతో వాట్సాప్‌ ఈ దిద్దుబాటుచర్యలు చేపట్టింది. నకిలీ వార్తలను అరికట్టడానికి  వాట్సాప్‌ చేస్తున్న ప్రయత్నంపై తెలంగాణ జొగులంబ గడ్వాల్ ఎస్పీ రెమా రాజేశ్వరి స్వాగతించారు. మరోవైపు కేవలం ప్రకటనలను మాత్రమే విడుదల చేస్తే పరిస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండదని అల్ట్ న్యూస్  సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలో ఇప్పటికే చేపట్టి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా  తగిన  చర్యలు చేపట్టాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com