సాగరతీరంలో ఆడియో విడుదల

- July 27, 2018 , by Maagulf
సాగరతీరంలో ఆడియో విడుదల

దిశాంత్‌, ఐశ్వర్య అడ్డాల జంటగా నటిస్తున్న చిత్రం సాగరతీరంలో. ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలు గురువారం నిర్మాత మల్కాపురం శివకుమార్‌, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ పాటలు బావున్నాయని, సినిమా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ట్రైలర్స్‌ ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. చిన్న సినిమాను అందరూ ప్రోత్సహించాలని అన్నారు.
కోనసీమ ప్రాంతాలతో పాటుగా ఎన్‌రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. లాస్య ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా వినోద్‌, నరేంద్ర, అంబటి శ్రీను, నామాల మూర్తి, పవన్‌ సురేష్‌, సిద్దు రాయపురెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com