డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సింగర్
- July 27, 2018
ఈ మద్య హైదరాబాద్ లో ఎంతో మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతున్నారు. సామాన్యులు పట్టుబడితే పెద్ద విశేషం ఏమీ ఉండదు..కానీ కొంత కాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెలబ్రెటీలు, బడా వ్యాపారుల, డాక్టర్లు సైతం పట్టుబడుతున్నారు. దాంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆ మద్య బుల్లితెర యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ తతంగం ఎంతో సీరియస్ అయ్యింది..నెల రోజులు సాగిన డ్రామాకు కోర్టులో హాజరై ఇక నుంచి ఇలాంటి పనులు చేయనని చెప్పాడు యాంకర్ ప్రదీప్.
ఇలా ఎంతో మంది నటీ,నటులు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడుతున్నా వీరి తీరు మాత్రం మారడం లేదు. తాజాగా జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగoజ్ డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేస్తే 175 ఎంజీ వచ్చింది. అయితే తాను తాగలేదని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఆ సమయంలో యాంకర్, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. పూర్ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లతో రాహుల్ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్ సాంగ్ కూడా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. లైసెన్స్ కూడా లేకుండానే రాహుల్ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది. a
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







