అరుదైన మనోహర దృశ్యం..
- July 27, 2018
ఖగోళంలో అత్యద్భుతం ఆవిష్కృతమైంది. ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. అరుణగ్రహం భూమికి అతి చేరువగా వచ్చిన అరుదైన మనోహర దృశ్యం… యావత్ ప్రపంచానికి మర్చిపోలేని అనుభూతి మిగిల్చింది. 103 నిమిషాల పాటు కొనసాగిన చంద్రగ్రహాణాన్ని తిలకించి జనం ఆశ్చర్యానికి లోనయ్యారు.
సుదీర్ఘ సమయం పాటు కొనసాగిన సంపూర్ణ చంద్రగ్రహణం.. సరిగ్గా రాత్రి 11.44 గంటలకు మొదలైంది. అర్ధరాత్రి ఒంటి గంటకు సంపూర్ణ దశకు చేరుకుంది. అనంతరం క్రమంగా చంద్రుడు బయటకు రావడంతో రెండో దశ మొదలైంది. మరోవైపు ఈ అద్భుత చంద్రగ్రహణం అనుభూతిని రెట్టింపు చేసేందుకు అరుణ గ్రహం కూడా జోడీ కట్టింది. దీంతో సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం, అరుణవర్ణ చంద్రుడితో పాటు అంగారక దర్శనానికి వినీలాకాశం వేదికైంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







