ఎన్ఆర్ఐల సమన్లు కోసం ప్రత్యేక పోర్టల్:సుష్మా స్వరాజ్‌

- July 27, 2018 , by Maagulf
ఎన్ఆర్ఐల సమన్లు కోసం ప్రత్యేక పోర్టల్:సుష్మా స్వరాజ్‌

న్యూ ఢిల్లీ:భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్‌ చేస్తామని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. పోర్టల్‌ అభివృద్ధి చేసేందుకు కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనకు న్యాయ శాఖ, హోం శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు అంగీకరించాయని సుష్మ స్వరాజ్ అన్నారు.

ఎన్నారై భర్తలు వారి భార్యలను వదిలేసి పారిపోవడాన్ని, పెళ్లి చేసుకున్న తర్వాత శారీరకంగా, మానసికంగా వారిని హింసించడాన్ని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత మూడేళ్లలో 2015 జనవరి నుంచి 2017 నవంబరు వరకు ఎన్నారై భర్తల వేధింపులు, వదిలేసి వెళ్లడానికి సంబంధించి మహిళల నుంచి 3,328 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. పోర్టల్‌ తీసుకురావడానికి చేయాల్సిన మార్పులను కేబినెట్‌లో చర్చిస్తామని, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ఆమోదించేలా ప్రయత్నిస్తామని సుష్మ వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్‌పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com