'ఈ మాయ పేరేమిటో' ఆడియో విడుదల

- July 28, 2018 , by Maagulf
'ఈ మాయ పేరేమిటో' ఆడియో విడుదల

హైదరాబాద్:సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. ఈ చిత్రం ఆడియోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

రాహుల్ విజయ్ సరసన హీరోయిన్‌గా కావ్యా థాపర్ నటించారు. వి.ఎస్‌. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దివ్యా విజయ్ ఈ లవ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసిన విషయం తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com