మహారాష్ట్ర:విహారయాత్రలో విషాదం.. 32 మంది మృతి
- July 28, 2018
మహారాష్ట్ర:విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో సుమారు 35 మందితో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందారు. అంబేనలి ఘాట్‌లో పొలందపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు పడిన లోయ.. లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సతారా జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 30మందికిపైగా చనిపోయారు. అంబేనలి ఘాట్ పొలందపూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో డ్రైవర్ తో సహా బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. కొంకణ్ అగ్రికల్చర్ వర్సిటీకి చెందిన స్టాఫ్ మహాబలేశ్వరం విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు..మృతదేహాలను లోయలో నుంచి వెలికితీశారు.
వీకెండ్ కావడంతో కొంకణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 33 మంది సిబ్బందితో పాటు డ్రైవర్, క్లీనర్ మొత్తం మహాబలేశ్వరం విహార యాత్రకు బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యలోనే బస్సు అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. సుమారు 800 అడుగుల లోతులో పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు లోయలో పడేముందే అప్రమత్తమైన ఓ వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి బయటకు వచ్చి అక్కడి స్థానికులకు చెప్పే వరకు ప్రమాదం జరిగినట్లు ఎవరికీ తెలియదు.
సమాచారం అందుకున్న పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయ బాగా లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం నెలకొంది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించి.. వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!