భారత కార్మికులకు కువైట్ ప్రభుత్వం అభయహస్తం
- July 31, 2018
కువైట్: నిర్మాణ రంగంలోని ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ ద్వారా పనులు చేసి బకాయిల కోసం ఎదురు చూస్తున్న 710 మంది కార్మికులకు ఎట్టకేలకు కువైట్ ప్రభుత్వం అభయహస్తం చూపింది. కార్మికులకు సంబంధించి తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత దేశానికి తిరుగుముఖం పట్టిన కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి బకారుూలను సైతం ఆ ప్రైవేటు కంపెనీ చెల్లించలేదు. ఈ క్రమంలో కువైట్ ప్రభుత్వమే ఈ కార్మికులకు పరిహారం చెల్లించేందుకు సంసిద్ధను తెలియజేసింది. కువైట్ కార్మిక, సాంఘిక కార్యకలాపాల మంత్రిత్వ శాఖ ద్వారా ఒక్కో కార్మికునికి 56,680 (కేడీ 250) రూపాయలు సహాయంగా అందజేయడం జరుగుతుంది. వీరంతా గడచిన రెండేళ్ల కాలంగా పబ్లిక్ అథారిటీస్ ఆఫ్ మేన్‌పవర్ (పీఏఎం)లో తమ పేర్లను నమోదు చేసుకుని మన దేశం నుంచి కువైట్ వెళ్లి కరాఫీ నేషనల్ కంపెనీ పేరిట ఉన్న ప్రైవేటు కంపెనీలో కార్మికులుగా పనిచేశారని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. ఇలావుండగా గత యేడాది కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 3,614 మంది కార్మికులు కష్టాల్లో పడి దేశానికి తిరుగుముఖం పట్టారని వీరికి కూలీ బకాయిలు, సెక్యూరిటీ డిపాజిట్లు తిరిగి రావాల్సివుందని వారి అకౌంట్లలోకి సొమ్మును బదలాయించడం జరుగుతుందని కువైట్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. కాగా మన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ యేదాది ప్రధమార్థంలో కువైట్ వెళ్లి అధికారులతో ఈ అంశంపై సంప్రదింపులు జరిపి సమస్యకు ఓ పరిష్కారాన్ని నిర్ణయించారు. భారత రాయబార కార్యాలయ అధికారులు సైతం తదుపరి ఈ వ్యవహారంపై కసరత్తు చేసి పలు కారణాలచేత బాధిత కూలీల జాబితాను మొత్తం 1,262 మందిగా సవరించి కువైట్ ప్రభుత్వానికి నివేదించించారు. అయితే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్‌పవర్ (పీఏఎం) అధికారులు జాబితాను 710కి కుదించి వీరే పరిహారం అందుకోవడానికి అర్హులుగా నిర్ణయించారని భారత రాయభార కార్యాలయ అధికారులు తెలిపారు.
కాగా మిగిలిన 552 మంది కార్మికులకు సైతం న్యాయం చేసేందుకు తమ వంతు కృషిని భారత రాయభార కార్యాలయ అధికారులు చేపట్టి కువైట్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







