వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్‌ దూకుడు

- July 31, 2018 , by Maagulf
వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్‌ దూకుడు

చైనాలో జరగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ దూసుకెళ్తున్నాడు. అన్‌సీడెడ్‌ ఆటగాడు పాబ్లో అబియాన్‌తో ఇవాళ జరిగిన పోరులో 21-15, 12-21, 21-14తో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌.. రెండో గేమ్‌ను చేజార్చుకున్నాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ విరుచుకుపడడంతో పాబ్లో చేతులెత్తేశాడు. వరుస పాయింట్ల గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com