సిమెంట్ ట్రక్‌కి ప్రమాదం: డ్రైవర్ సురక్షితం
- August 02, 2018
యూ.ఏ.ఈ:కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఓ రోడ్డు ప్రమాదంలో బోల్తా పడగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడిన ఘటన అజ్మన్‌లో చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకోగానే అజ్మన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంబులెన్స్ టీమ్స్, సివిల్ డిఫెన్స్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మెటల్ కటింగ్ ఎక్విప్మెంట్, క్రేన్స్ వినియోగించి ప్రమాదంలో ఇరుక్కున్న ట్రక్ నుంచి డ్రైవర్ని వెలుపలకి తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్ అధికారి మేజర్ మర్వాన్ యూసుఫ్ అల్ షామ్షి మాట్లాడుతూ, వాహనదారులు తగిన వేగంతో వాహనాల్ని నడపాలనీ, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలనీ, అతి వేగంతో వాహనాలు నడపకూడదని సూచించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..