హైదరాబాద్ లో రాత్రి ఒంటిగంట వరకు బార్లు..
- August 03, 2018
హైదరాబాద్:రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖజానా నింపుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించడం లేదు. బార్ల యజమానులు కూడా మరీ అర్థరాత్రి 12 గంటల వరకే అంటే ఎలా ఇంకో గంట పెంచితే మీకూ ఆదాయం, మాకు ఆదాయం అంటూ ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఈ శుభవార్త అన్ని నగరాలకు కాదు. ఒక్క హైదరాబాద్ వాసులకు మాత్రమే. GHMCతో పాటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని బార్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంచే బార్లను మరో గంట పొడిగించి మందుబాబుల్ని మద్యం మత్తులో జోగమంటున్నారు. ఈ సువర్ణావకాశం శుక్ర,శని వారాల్లో మాత్రమే అంటోంది ఎక్సైజ్ శాఖ. వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని బార్ల యజమానులు మరో గంట పెంచాలంటూ కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగి డ్రైవ్ చేయకండి..ఇంకొకరి ప్రాణాలు బలి తీసుకోకండి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు