రోజుకు ఐదంటే ఐదు చాలు...
- August 03, 2018
ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారుండరు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు. దీనికి కారణం ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ ఎండు ద్రాక్ష ఆరగిస్తే కలిగే లాభాలను ఓసారి పరిశీలిద్ధాం.
* ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
* ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ ఓ కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. 4 - 5 గంటల తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలాక్రమం తప్పకుండా చేస్తే అనీమియా వ్యాధి దూరమవుతుంది.
* ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను దృఢంగా ఉండేలా చేస్తాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.
* ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల ఇందులోని క్యాల్షియం కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తుంది.
* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
* ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపడటానికి సాయపడతాయి.
* పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట పక్కలో మూత్రవిసర్జన చేయరు.
* ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









