రష్యా విమానాన్ని ఐసిస్ కూల్చలేదని..

- December 14, 2015 , by Maagulf
రష్యా విమానాన్ని ఐసిస్  కూల్చలేదని..

సినాయ్‌లో కూలిన రష్యా విమానాన్ని ఉగ్రవాదులు కూల్చలేదని ఈజిప్టు స్పష్టం చేసింది. ఉగ్రవాదుల వల్లే రష్యా విమానం కూలిందనడానికి ప్రాధమిక విచారణలో ఆధారాలు ఏమీ దొరకలేదని ఈజిప్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని ఈజిప్టు పౌర విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆ విమాన దుర్ఘటనలో సుమారు 224 మంది ప్రయాణికులు మరణించారు. అయితే విమానంలో ఉగ్రవాదులు బాంబు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని రష్యా ఆరోపించింది. సాంకేతిక విచారణాధికారుల కమిటీ చేపట్టిన దర్యాప్తులో ఉగ్ర అనుమానాలకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ చిక్కలేదని ఓ అధికారి తెలిపారు. రష్యా విమానాన్ని తామే కూల్చామని గతంలో ఐసిస్ కూడా ప్రకటించుకుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com