సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు..వాతావరణ ప్రతికూలత..సహాయక చర్యలకు విఘాతం
- August 04, 2018
మానస సరోవర్ యాత్రకు వెళ్లి సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వాతావరణ ప్రతికూలత అడ్డంకిగా మారింది. సిమికోట్ నుంచి వారిని నేపాల్ కు తరలించేందుకు విమానాలను ఉపయోగించాలంటే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగడం లేదు. వాతావరణం అనుకూలించగానే యాత్రికులను విమానాల ద్వారా నేపాల్ కు చేర్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ అధికారులు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సిమికోట్ లో చిక్కుకున్న యాత్రికులకు ఆహారం, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా సిమికోట్ లో చిక్కుకున్న యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







