ఇండోనేషియాలో భారీ భూకంపం..
- August 05, 2018
జకార్తా: ఇండోనేషియా ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఇండోనేషియాకు చెందిన లాంబోక్ దీవిలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉంది. దీంతో ఇండోనేషియా విపత్తు నిర్వహణ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వారం కిందట కూడా ఇదే దీవిలో భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కంటే కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు. ఇండోనేషియాతోపాటు చుట్టుపక్కల దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే బాలిలోనూ భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







