20 నర్సరీల ప్రారంభానికి ఫ్రెంచ్ గ్రూప్ సన్నాహాలు
- December 14, 2015
బాబిలో గ్రూప్ యూఏఈలో 20 నర్సరీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 400 మంది సిబ్బందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. యూరోప్ వ్యాప్తంగా సుమారు 850 నర్సరీలను కలిగి వుంది ఈ సంస్థ. బాబిలో గ్రూప్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజర్ మాట్లాడుతూ రానున్న మూడేళ్ళలో 20 నర్సరీలను యూఏఈలో స్థాపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెనా రీజియన్లో మొత్తం 50 నర్సరీలను స్థాపించాలనే లక్ష్యం పెట్టుకున్నారట. తొలి సిగ్నేచర్ నర్సరీని దుబాయ్ డౌన్టౌన్లో ప్రారంభించారు. రెండో బ్రాంచ్ ఉమ్ సకీమ్లో రానున్న కొద్ది వారాల్లో ప్రారంబిస్తారు. ఒక్కో నర్సరీ కోసం 20 మందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. దుబాయ్ మరియు షార్జాల్లో తమ కార్యకలాపాల్ని విస్తరించాలనుకుంటున్నామనీ, 2016లో దుబాయ్లో కార్యకలాపాల్ని విస్తరించడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టామని బాబిలో గ్రూప్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







