హట్టా బోర్డర్‌కి ప్రత్యామ్నాయం
- December 14, 2015
ఒమన్ నుంచి యూఏఈలోకి రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకునేవారు హట్టా బోర్డర్‌కి ప్రత్యామ్నాయం ఎంచుకోవాలని ఎంబసీ అధికారులు సూచిస్తున్నారు. వారాంతాలు, శెలవుదినాల్లో మట్టా మార్గం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతోందనీ, ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించాలని వాహనదారులకు అధికారులు సూచించారు. ఒమన్‌లోని యూకే ఎంబసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే యూఏఈ ఎంబసీ మాత్రం ఎలాంటి కంప్లయింట్స్ తమకు రాలేదని చెబుతుంది. సోషల్ మీడియా ద్వారా యూకే ఎంబసీకి ట్రాఫిక్ ఇబ్బందులపై ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఒమన్‌కి వచ్చే అల్ అయిన్, అల్ బురైమి బోర్డర్‌లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. కల్బా రోడ్ ద్వారా ఒమన్‌లోకి వచ్చేటప్పుడు రెండున్నర గంటలు అదనంగా సమయం పడుతోందని పలువురు ప్రయాణీకులు చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







