ఇంపోర్ట్స్‌లో నాలుగో స్థానంలో మొబైల్‌ ఫోన్లు

- August 07, 2018 , by Maagulf
ఇంపోర్ట్స్‌లో నాలుగో స్థానంలో మొబైల్‌ ఫోన్లు

బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లో దిగుమతుల పరంగా మొబైల్‌ ఫోన్స్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. 1 మిలియన్‌కి పైగా మొబైల్‌ ఫోన్స్‌ కింగ్‌డమ్‌లోకి ఇంపోర్ట్‌ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 10 దేశాల నుంచి 51 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ విలువైన 528,182 మొబైల్‌ ఫోన్లను ఇతర కమ్యూనికేషన్స్‌ ఎక్విప్‌మెంట్‌ని బహ్రెయిన్‌ దిగుమతి చేసుకుంది. ఇది 2018 తొలి ఆరు నెలలకు సంబంధించిన గణాంకాల సారాంశం. గత ఏడాదితో పోల్చితే 12 శాతం తగ్గాయి. 2017 తొలి అర్థ భాగంలో 603,429 మొబైల్‌ ఫోన్స్‌ ఇంపోర్ట్‌ అయ్యాయి. డాటాని విశ్లేసిస్తే, చైనా 55.1 శాతంతో ముందంజలో వుంది. చైనా నుంచే ఎక్కువగా ఈ రంగంలో దిగుమతులు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానం వియత్నాం (37.1 శాతం). శాంసంగ్‌, ఐ ఫోన్‌, హువాయ్‌ వరుసగా మొదటి మూడు స్థానాల్లో వున్నాయి ఇంపోర్ట్స్‌ పరంగా. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com