జూనియర్ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి!
- August 08, 2018
సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్‌ల దగ్గర నుంచి హీరోయిన్ల వరకు తరుచూ లైంగిక దాడులు జరుగుతాయని పలువురు ఆరోపిస్తుంటారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ సృష్టించిన ప్రకంపనలు అంత ఇంత కాదు.. రంగుల ప్రపంచంలో జూనియర్ ఆర్టిస్ట్‌లు మొదలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల దాకా లైంగిక వేంధిపులకు బలైనవారు చాలా మంది ఉన్నారనేది కొందరు ఒప్పుకోలేని నిజం. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందని వస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి.
గుంటూరుకు చెందిన ఓ ఇద్దరు యువతులు లంగర్‌హౌస్‌లో ఓ హాస్టల్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్లో ఉంటోంది. కొద్దికాలం క్రితం ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న యువతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్లో చేరాడు. సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరు ‘మన’ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేశారు.
అయితే సభ్యత్వం పేరిట వసూలు చేసిన డబ్బుల విషయంలో వివాదం ఏర్పడింది. ఇది మనసులో పెట్టుకున్న రాజ్ కిరణ్ పథకం పన్నీ, మరో ముగ్గురితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని.. బాధితురాలు హైదరాబాద్‌లోని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు పిర్యాదు మేరకు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







