'కత్తి' రీమేక్ చిరు 150వ సినిమా..
- December 15, 2015
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. చిరు 150వ సినిమా ఎప్పుడనేది ఇండస్ట్రీలో మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. బెంగళూరు 150వ సినిమాకి సంబంధించిన వార్తను రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన ఓ అవార్డు వేడుకలో తన తండ్రి చేయనున్న చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు చరణ్. తమిళ చిత్రం 'కత్తి' రీమేక్‌లో తన తండ్రి నటిస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారనీ చరణ్ పేర్కొన్నారు. సంక్రాంతికి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. బ్రూస్ లీ సినిమాలో చిరు స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చినా ఆశించన ఫలితం రాకపోవడంతో నిరాశగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమాతోనైనా ఊరట లభిస్తుందేమో చూడాలి. అయితే గతం నుంచి చిరు 150వ సినిమా రిమేక్ చేయడం పై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం కొత్త స్టోరీకి వెళ్లి చేతులు కాల్చుకోకుండా హిట్ సినిమాగా ఉన్న 'కత్తి'ని రిమేక్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముందుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మూవీ రానుందని అనేక వార్తలు వచ్చాయి. దీని గురించి పూరి కూడా మీడియాతోమాట్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో చిరు 150వ సినిమా అనే వార్తలు వినిపించినా అవి పెద్దగా ప్రాధాన్యతలోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా 'కత్తి'ని రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. 'చరణ్' స్టేట్మెంట్ దీనికి మరింత బలం చేకూర్చింది. కాగా ఎన్నో రోజులుగా మెగాస్టార్ 150వ సినిమా గురించి అనేక పుకార్లు శికార్లు చేస్తున్న తరుణంలో ఈ వార్త కూడా 'గాసిప్' కాకుంటే బావున్ను అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









