వాస్తవ దర్శనాలు....!!

- December 15, 2015 , by Maagulf

 

నేస్తం ....

 

     ఎలా ఉన్నావు ...?  పలకరింపులు చాలా దూరం జరిగాయి కదూ మన మద్యలో ... ఏంటో ఈ మద్య అందరూ వాస్తవాలు ఒప్పుకుంటుంటే  నేను జరుగుతున్న నిజాలను చూస్తూ ఉండిపోతూ ఓ ప్రేక్షకురాలినయ్యా .. సరే ఇక నీకు ఆ వాస్తవ దర్శనాలు చూపించాలి... ఓ ... చెప్పాలి కదా ... ఆ మధ్యేమో ఓ పెద్దాయన పెద్ద మనసుతో తన అవార్డుని వెనక్కు ఇచ్చి తన దొడ్డ మనసుని చాటుకున్నారు.. ఓ మహా నటుడేమో తన నటనతో ఇంకా ఇక్కడే ఇలానే సహనంతో జీవించేస్తా అసహనంతో సహవాసం చేస్తూ తన సహనాన్ని దేశభక్తిని చాటుకుంటూ అంటూ.... ఇప్పుడేమో ఓ పెద్దావిడకి కొత్తగా తన కుటుంబ మూలాలు గుర్తుకు వచ్చాయి కాబోలు అమ్మగారికి ఇన్నాళ్ళుగా ఒక్కసారి వినిపించని అత్తగారి నామజపం ఇప్పుడు నోటివెంట వచ్చిందేవిటి చెప్మా... పక్కనే సముద్రం ఉంటే నిలువ నీడ లేక తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ఎంతో ముందుకు పోయాం ఈ సాంకేతిక యుగంలో అని గుడ్డి భ్రమలో బతుకుతున్న మనకు మరోసారి మానవ తప్పును ఎత్తి చూపి మనల్ని పరిహసిస్తోన్న ప్రకృతి...

పార్టీల ఫిరాయింపులు, ఫోన్ టాపింగులు, కుటిలత్వాలు, కుతంత్రాలు ... పైకేమో ఒకరికొకరు చిరునవ్వుల ఆహ్వానాలు ... మద్యలో ఎవరిని మోసం చేయడానికి..? కార్పోరేట్ స్కూల్స్ వాటికి ధీటుగా ఇప్పుడు కార్పోరేట్  ధవాఖానాలు... ఇసుక దందాలు ,  కొత్తగా కాల్ మని అంటూ హొరెత్తిస్తున్న న్యూస్ మీడియా .. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అంతం ఎక్కడంటావు .... అంతే కదా అదే నాకు తెలియక ఇక ఇప్పటికి ఇక్కడితో ఆపేస్తూ మరోసారి మళ్ళి పలకరించనా...

 

 

--మంజు యనమదల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com