విబ్రి మీడియా బ్యానర్‌లో 'జయలలిత' బయోపిక్
- August 17, 2018
మోస్ట్ చార్మింగ్, డేషింగ్ లేడీ పొలిటీషియన్‌గా చరిత్రలో నిలిచిపోయిన జయలలిత జీవితం ఆధారంగా విబ్రి మీడియా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.. ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయశక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారతీయ రాజకీయాల్లో ఆమెస్థానం ఒక చెరగని సంతకం.. మహిళలందిరకీ ఆదర్శంగా నిలిచిన ఘనమైన చరిత్ర కలిగిన ఆమె ప్రయాణాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజు పురస్కరించుకుని ఆరోజే చిత్ర ప్రారంభోత్వసాన్ని ఘనంగా నిర్వహించిన అదేరోజున ఫస్ట్‌లుక్‌ను కూడ విడుద లచేయనున్నామని విబ్రి మీడియా డైరెక్టర్ , సైమా అవార్డ్స్ చైర్మన్ బృందా ప్రసాద్ అడుసుమల్లి వెల్లడించారు.. మాదరాసుపట్టణం చిత్రంతో దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న విజయ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత విష్ణు ఇందూరి మాట్లాడుతూ, విబ్రి మీడియా నుంచి నిజమైన కథ, జీవితాలు తెరకెక్కించాలన్నది తమ కలగా చెప్పారు. విజయ్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారని తెలిపారు. .బాలీవుడ్, సౌత్‌కు చెందిన ప్రముఖ తారాగణం ఈచిత్రంలో నటించనున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







