మక్కాలో కూలిన హోటల్: అన్నీ పుకార్లే
- August 17, 2018
సౌదీ అరేబియా:మక్కాలో ఓ హోటల్ కూలిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ సివిల్ డిఫెన్స్ ఖండించింది. అయితే, మాక్‌డ్రిల్ సందర్భంగా చేసిన ఓ ఏర్పాటుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తోందనీ, అది కూడా కొన్నాళ్ళ క్రితం నాటిదనీ సౌదీ సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం ఏదైనా జరిగితే, వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చేసిన మాక్‌డ్రిల్‌ని తాజా ఘటనగా కొందరు మలచి, ప్రచారం చేస్తున్నారని సౌదీ సివిల్ డిఫెన్స్ పేర్కొంది. మక్కాలో ఎలాంటి ప్రమాదం జరగలేదనీ, ఫిలిగ్రిమ్స్ ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని వివరణ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







