సౌదీ అరేబియాకి చేరిన హజ్ యాత్రికులు

- August 18, 2018 , by Maagulf
సౌదీ అరేబియాకి చేరిన హజ్ యాత్రికులు

జడ్డా: పవిత్ర హజ్ యాత్ర నిమిత్తం ఇప్పటి వరకు 1.28 లక్షల మంది భారతీయ యాత్రికులు సౌదీ అరేబియాకు చేరారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఈ యేడాది మొత్తం 1,28,702 మంది భారతీయ యాత్రికులకు ప్రభుత్వం హజ్ కమిటీ ద్వారా యాత్రకు అవసరమైన వసతులను కల్పిస్తోంది. 466 ప్రత్యేక విమానాలను హజ్ యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగిందని, శుక్రవారం ఉదయం ఇక్కడి నుంచి చివరి సారిగా ఒక విమానం హజ్ ప్రయాణికులతో బయలుదేరి వెళ్లిందని జడ్డాలోని ఇండియన్ కౌన్సులేట్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ యేడాది భారత్ నుంచి రికార్డు స్థాయిలో లక్షా 75వేల ఇరవై ఐదు మంది హజ్ యాత్రకు తరలుతున్నారని, ఇది గత యేడాదికన్నా 47 శాతం అధికమని అధికార వర్గాలు తెలిపాయి. 
ప్రత్యేకించి మహిళలు భారత దేశం నుంచి అధిక సంఖ్యలో ఈ యాత్రకు తరలివచ్చారన్నారు. సౌదీ అరేబియాకు హజ్‌యాత్రకు తరలివచ్చే ప్రతి మహిళా యాత్రికురాలికి ఒక సహాయకుడు (భర్త లేదా మరెవరైనా) వెంట ఉండాలని గత యేడాది సౌదీ ప్రభుత్వం నిబంధన విధించింది. ఐతే ఈ యేడాది వచ్చే మహిళలెవరూ తమతో పురుష సహాయకుడిని తీసుకురాలేదని, అలాగే తొలిసారిగా సబ్సిడీ లేకుండా హజ్ యాత్రికులు వస్తున్నారని అధికారి వివరించారు. ఇస్లాం నాలుగు స్తంభాలుగా భావించే అత్యున్నత పవిత్ర యాత్రను ప్రతి ఒక్కరు కనీసం జీవితంలో ఒక్కసారైనా చేయాలని భావిస్తారు. సుమారు 1.6 మిలియన్ ముస్లిం యాత్రికులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి హజ్ యాత్ర నిమిత్తం సౌదీ అరేబియాకు తరలివచ్చారు. మార్గ మధ్యలో వారు కబ్బా, మక్కా తదితర పవిత్ర స్థలాలను సందర్శించారు.

Dailyhunt

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com