నాటుకోడి గోంగూర

- August 18, 2018 , by Maagulf
నాటుకోడి గోంగూర

కుక్కర్‌లో కోడి స్కిన్‌, లెగ్స్‌, వింగ్స్‌, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేయాలి.
ఐదు విజిల్స్‌ వచ్చేదాకా స్టవ్‌ మీద ఉంచాలి.
ఒక బాండి తీసుకుని అందులో గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె, నీళ్లు పోసి ఉడికించాలి.

గోంగూర ఉడికిన తర్వాత పప్పుగుత్తితో పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
అల్లం-వెల్లుల్లి పేస్టును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌ మీద బాండి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. ధనియాలపొడి కూడా వేసి వేగనివ్వాలి.
తర్వాత ఉడికించి రెడీగా పెట్టుకున్న మాంసాన్ని, గోంగూర మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి నీళ్లు పోయకుండా రెండు నిమిషాలు ఉడికించాలి. ఆతర్వాత కూరను వేరే పాత్రలోకి మార్చి దానిపై కొత్తిమీర తరుగు చల్లాలి. నాటుకోడి గోంగూర రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com