హైదరాబాద్:డ్రంకెన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన యువతులు
- August 24, 2018
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు యువతులు రెచ్చిపోయారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా ట్రాఫిక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా చిందులు వేశారు.
వెస్ట్‌జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ఆరు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు యువతులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా… కొద్దిసేపు నడిరోడ్డుపై హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. చివరకు ఎలాగోలా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు… ముగ్గురు యువతులు మద్యం సేవించినట్లు నిర్ధారించారు. వీరిలో ఓ అమ్మాయికి ఏకంగా 192 పాయింట్లు రావడంతో… ఖాకీలే షాకయ్యారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్‌జోన్ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు… మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు. 20 కార్లతో పాటు 10 టూవీలర్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







