త్వరలో మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు:డీఆర్డీవో చైర్మన్
- August 26, 2018
DRDO ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తయిన డాక్టర్ సతీష్ రెడ్డి నియమించింది కేంద్రం. సతీష్ ఇప్పటికే రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన DRDOకి చైర్మన్ అయిన సతీష్‌రెడ్డిది నెల్లూరు జిల్లా. హైదరాబాద్ JNTUలోనే ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 1985లో DRDOలో చేరారు. హైదరాబాద్ సెంటర్‌కు డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీల్లో విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆయన సేవలకు, సమర్థతకు గుర్తింపుగా ఇప్పుడు DRDO చైర్మన్ బాధ్యతలు సతీష్‌రెడ్డికి అప్పగించింది కేంద్రం. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామంటున్న సతీష్‌రెడ్డి, త్వరలో మనం మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు వాటిని అందించే స్థాయికి ఎదగాలన్న టార్గెట్‌తో పనిచేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







