ఒకే రోజు మూడు సినిమాలు...
- August 26, 2018
ఈ వినాయక చవితి కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరమంచి పోటీనే నెలకొని ఉంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా రెండు సినిమాల విషయంలో ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ రెండే సమంత నటిస్తున్న యూ టర్న్ మూవీ కాగా , మరోటి నాగ చైతన్య శైలజా రెడ్డి.
వాస్తవానికి శైలజా రెడ్డి ఆగస్టు 31 న విడుదల అవ్వాల్సి ఉండగా , రీ రికార్డు పనులు పూర్తి కాకపోయేసరికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 07 న అనుకున్నప్పటికీ ఆ రోజు మూడు నాల్గు సినిమాలు ఉండడం తో నిర్మాతలు ఆ రోజు కాకుండా సెప్టెంబర్ 13 వినాయక చవితి రోజయితే బాగుంటుందని ఆ తేదీని ఫిక్స్ చేసారు. ఇక ఆరోజు చైతు తో సమంత యూ టర్న్ తో పోటీ పడుతుంది. ఈ రెండు సినిమాలే కాదు సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రం కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో మొత్తం మీద ఈ మూడు చిత్రాల మధ్య మాత్రం విపరీతమైన పోటీ ఉండనుంది. మరి ఈ మూడిట్లో ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







