విదేశీ పర్యటనకు భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- August 26, 2018
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు ఆదివారం బయల్దేరారు. వియత్నాం, కాంబోడియాలలో ఆమె ఈ నెల 30 వరకు పర్యటిస్తారు. వియత్నాంలో ఈ నెల 27, 28 తేదీల్లోనూ, కాంబోడియాలో ఈ నెల 29, 30 తేదీల్లోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వియత్నాంలో జాయింట్ కమిషన్ 16వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వియత్నాం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్హ్ మిన్హ్ పాల్గొంటారు. వియత్నాం ప్రధాన మంత్రి ఎన్‌గుయెన్ జువాన్ ఫుస్‌తో చర్చలు జరుపుతారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తారు.
కాంబోడియాలో ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రాక్ సోఖోన్న్‌తో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధాని హున్ సేన్, ఆ దేశ సెనేట్ అధ్యక్షుడు సే ఛుమ్‌లతో చర్చలు జరుపుతారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







