నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తల కు అభినందనలు ..

- December 16, 2015 , by Maagulf
నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తల కు అభినందనలు ..

పీఎస్ఎల్ వీ-సీ29 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. శాస్త్రవేత్తలు పీఎస్ ఎల్ వీ-సీ29 రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా మరో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించారని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు 50 సంవత్సరాలకు చేరుకున్న సందర్భంలో ఈ ప్రయోగం జరగడం విశేషంగా తెలిపిన ప్రధాని, సింగపూర్ తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com