కొబ్బరితో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు...
- September 04, 2018
కొబ్బరిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొబ్బరిని తరచుగా తీసుకుంటే థైరాయిడ్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, బరువు తగ్గడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ప్రతిరోజూ కొబ్బరి తరచుగా తీసుకోవడం వలన పొట్టచూట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
ఈ కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. పాల కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ, గుండె మంటను తగ్గిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వలన చర్మంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
జిడ్డు చర్మానికి కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్స్‌ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







