టీఆర్ఎస్ ‘ప్రజల ఆశీర్వాద సభ’ బాధ్యతలు వీరికే

- September 04, 2018 , by Maagulf
టీఆర్ఎస్ ‘ప్రజల ఆశీర్వాద సభ’ బాధ్యతలు వీరికే

తెలంగాణ:అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిన మర్నాటి నుంచి ప్రజల్లోకి వెళ్లబోతోంది TRS. 50 రోజుల్లో 100 ప్రాంతాల్లో సభలు పెట్టేందుకు రూట్‌మ్యాప్ రెడీ చేసుకుంది. హుస్నాబాద్‌ మొదటి నుంచి కేసీఆర్‌కు సెంటిమెంట్ ఉన్న ప్రాంతం కావడంతో.. ఈసారి కూడా అక్కడి నుంచే ప్రచారం మొదలుపెడుతున్నారు. 7వ తేదీన “ప్రజల ఆశీర్వాద సభ”లకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా విజయవంతం కావడంతో ఆ సెంటిమెంట్‌ కొనసాగించనున్నారు.

మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాల నుంచి ప్రజల్ని సభకు తీసుకు వచ్చేందుకు ఏం చేయాలన్న దానిపై స్థానిక నేతలతో చర్చించారు. చిగురుమామిడి మండలం బాధ్యతలు కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కి అప్పగించారు. సైదాపూర్‌ మండలానికి సమన్వయకర్తగా మంత్రి ఈటల ఉంటారు. కోహెడ నుంచి జన సమీకరణ బాధ్యతను మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చూసుకుంటారు. అక్కన్నపేటకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, భీమరదేవరపల్లికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ఎల్కతుర్తికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, హుస్నాబాద్‌ పట్టణం, గ్రామీణ ప్రాంతానికి మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి పర్యవేక్షకులుగా పనిచేయనున్నారు. నియోజకవర్గం మొత్తం నుంచి 60 నుంచి 70 వేల మందిని సభకు తీసుకురావాలన్నది TRS ప్లాన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com