రియల్ హీరో ఆఫ్ బహ్రెయిన్
- September 04, 2018
బహ్రెయిన్:బహ్రెయినీ పౌరుడొకరు 'రియల్ హీరో' అన్పించుకున్నారు. నీటిలో మునిగిపోతున్న ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని ప్రాణాలకుత తెగించి కాపాడాడు. దురదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఐదేళ్ళ బాలిక ఫాతిమా జాఫర్ అ అలి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అత్యంత విషమ పరిస్థితుల్లో ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమెను రక్షించేందుకు వైద్యులు చాలా ప్రయత్నించారు. అయితే ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయినట్లు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్లో బహ్రెయినీ సెయిలర్ జాఫర్ అహ్మద్ యూసఫ్‌ని హీరోగా అభివర్ణిస్తున్నారంతా. భారీ కెరటాలు కుటుంబాన్ని నీటి కొట్టుకుపోయేలా చేయగా, అది చూసిన సెయిలర్ జాఫర్ అహ్మద్, వెంటనే సముద్రంలోకి దూకి, ఒకరి తర్వాత ఒకర్ని రక్షించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







