దుబాయ్:భవనంపైనుంచి పడి ఓ వ్యక్తి మృతి
- September 04, 2018
దుబాయ్:బుర్ దుబాయ్‌లోని ఓ భవనం రూఫ్ టాప్ నుంచి కింది పడి భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన షఫీర్‌గా మృతుడ్ని గుర్తించారు. దుబాయ్‌లోని ఓ ప్రముఖ జ్యుయెలరీ షాప్‌లో ఈ వ్యక్తి పనిచేస్తున్నారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. లంచ్ తర్వాత రూఫ్ టాప్ మీదకు వెళ్ళిన షఫీర్, అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి వెళ్ళి కిందకి పడిపోయినట్లు అతని బంధువు చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..