ఒమన్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురు వలసదారులు క్షేమం

- September 04, 2018 , by Maagulf
ఒమన్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురు వలసదారులు క్షేమం

మస్కట్‌:విలాయత్‌ ఆఫ్‌ సోహార్‌లోని అల్‌ ముల్తాకా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ఘటనలో ముగ్గుర్ని రక్షించినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ పేర్కొంది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డవారిని యూరోపియన్లుగా గుర్తించారు. వీరికి చిన్న చిన్న గాయాలు కావడంతో, అవసరమైన వైద్య సహాయం అందించారు. పొగను పీల్చడంతో వీరు స్వల్ప అస్వస్థతకు గురయినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com