ఆసియ దెశెస్తులైన 6 దొంగలను అదుపులోనికి తీసుకొన్న ఒమాన్ పోలీసులు

- December 17, 2015 , by Maagulf
ఆసియ దెశెస్తులైన  6 దొంగలను అదుపులోనికి తీసుకొన్న ఒమాన్ పోలీసులు

 బార్బర్ షాప్ లోనికి వచ్చిన దొంగలు ముందుగా మంగలితో బేరం కుడుర్చుకొంటారుక్రాఫ్ పూర్తయిన  తర్వాత వారు 50 రియాల్ పెద్ద నోట్ ఇస్తారు. దీంతో, బార్బెర్ తన పనికి ఒప్పుకున్నా డబ్బులు మినహాయంచుకొని చిల్లర నోటేలను తిరిగి వారికి ఇస్తాడు, అంతేఇక వింత గొడవ   మొదలవుతుంది. కేవలం క్షురకర్మకు  50 రియాల్ మావద్ద  తీసుకొంటావా ? విదీశీయులంటే, నీకుఅంత  చులకనా అని మంగలితో వాగ్యువాదానికి దిగుతారు. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయమని నానా హంగామా  చేస్తారు. దీంతో  విస్తుపోయేన బార్బెర్ ....అదేమిటి ? నేను మీకు తిరిగి.. చిల్లరతో సహా ఇచ్చానుగా అని నిజాయతీగా చెబుతాడు. లేదు... లేదు.... నీవు మాకివ్వనే ఇవ్వలేదని  ఆందరూకల్సి  తడుముకోకుండా అబద్దం చెబుతారు. దీంతో తన షాప్ లో తరహ అల్లరి ఎందుకని.. మిగిలిన బేరాలు పోతున్నయనే కంగారులో   అమాయక బార్బెర్ తన  గల్లా పెట్టి నుంచి  వారికి 50  రియాల్నోటును బాధ పడ్తూ  ఘరానా దొంగలకు సమర్పించుకొంటాడు. దీంతో మంగలికి  చేతి కష్టం...దక్కగా పోగా జేబుకు నష్టం...ఏక కాలంలో జరగడంతో  తేరుకొనిలబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు  వరుస దోపిడీలతో...ఒమాన్ లో సంచలనం కల్గించిన    ఆరుగురు ఆసియ  దేశాలకు చెందిన దొంగల మోసాలకు ఎట్టకేలకు కళ్ళెం వేశారు ఒమాన్ పోలీసులు.వారి విచారణ,  పరిశోధనలో దొంగల గమ్మత్తు చోరీలు పలు మంగలి దుకాణాలనే  ఎంచుకోవడం గమనార్హం. వీరినిఅదుపులోనికి  తీసుకొని, తమదైన శైలి లో పోలీసులు విచారిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com