మొట్టమొదటి ' ములాఖాత్ ' అలా అయింది
- September 09, 2018
సెలబ్రిటీ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ ఇద్దరూ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో మెరిశారు. పాతికేళ్ళ సింగర్ జొనాస్..36 ఏళ్ళ ప్రియాంకతో తన మొట్టమొదటి ' ములాఖాత్ ' గురించి ఈ సందర్భంగా గుర్తు చేశాడు. మొదటిసారిగా ఓ ఫ్రెండ్ ద్వారా ఆమెను అప్రోచ్ అయినప్పుడు..' షీ ఈజ్ ది బెస్ట్ ' అన్న నిర్ధారణకు వచ్చానని తెలిపాడు. ఓ టెక్స్ట్ తో ఇద్దరం టచ్‌లోకి వచ్చామని, ఆరు నెలల పాటు నేరుగా మాట్లాడుకోకున్నా .. మెసేజ్‌లతో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేశామని అన్నాడు.
ఒకప్పుడు నా కన్సార్ట్‌కు వచ్చిన ప్రియాంక నాతో అంటీముట్టనట్టు మాట్లాడింది. కానీ ఆ తర్వాత మా పరిచయం పెరిగి, ప్రేమగా మారింది..అని చెప్పుకొచ్చాడు. మా కజిన్ పెళ్లితోను, ముంబై, గోవా టూర్లతోను మేం మరింత చేరువయ్యాం అని నిక్ వెల్లడించాడు. ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బహుశా అక్టోబరులో వీరి వివాహం జరగవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







