స్విట్జర్లాండ్‌లో శ్రీదేవి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు
- September 09, 2018
దివికేగిన భారతీయ అందాల తార శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పాలని స్విట్జర్లాండ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన చాందిని సినిమాను ఇక్కడి సుందర ప్రదేశాల్లో తెరకెక్కించారు. 2016లో భారత సినీ దిగ్గజం యష్ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో శ్రీదేవి పాత్రను పరిగణనలోకి తీసుకుని ఆమె విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా 1964లో రాజ్‌కపూర్ మూవీ సంగం నిలిచింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







