కారులో ఇరుక్కున్న చిన్నారి..కాపాడిన పోలీసులు
- September 10, 2018
కారులో ఇరుక్కున్న చిన్నారిని అబుదాబీ పోలీసులు రక్షించారు. యాస్ ఐలాండ్‌లోని బందర్ ప్రాంతంలో ఓ ఎస్‌యూవీ వాహనంలో చిన్నారిని పోలీసులు గుర్తించారు. ఆ కారు లో చిన్నారి ఇరుక్కుపోగా, తక్షణం స్పందించిన పోలీసులు అత్యంత జాగ్రత్తగా ఆ చిన్నారిని ప్రమాదం నుంచి కాపాడారు. చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్లలో ఒంటరిగా విడిచిపెట్టకూడదని తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. కార్లలో చిన్న పిల్లల్ని విడిచిపెడితే, తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయనీ, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంటుందనీ, అత్యధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుందని పోలీసులు వివరించారు. బాధితురాలి తండ్రి, తమ చిన్నారిని కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







